హనుమకొండ చౌరస్తా, నవంబర్ 26: హనుమకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు 76వ సంవిధాన్ దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఏ.గోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడారు. దేశప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాలను తెలియజేస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును ప్రతిఏటా నవంబర్ 26న సంవిధాన్ దివస్ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞ చేస్తామన్నారు.
విద్యార్థులందరూ కూడా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశఔనత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలేజీ విద్యార్థులచే రాజ్యాంగ ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వి.రాజశేఖర్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సవ్వాసి శ్రీనివాస్, ఆర్.ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.