హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: వడ్డెర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా రాంపూర్ గ్రామానికి చెందిన గండికోట సంపత్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు నియామకపత్రాన్ని అందజేశారు. పట్టణ అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్ నియమించారు.
కాజీపేట మండల యూత్ ప్రెసిడెంట్ పల్లపు నవీన్, రాంపూర్ గ్రామ అధ్యక్షునిగా పల్లపు సమ్మయ్యను నియమించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ వడ్డెరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన అధ్యక్షుడు ఐలమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్, నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.