సమ్మక్క పుట్టుపూర్వం బయ్యక్కపేట గ్రామంలోని గద్దెలపై రేపు (గురువారం) సమ్మక్క కొలువుదీరనుంది. చందా వంశీయుల ఆడబిడ్డగా పేరుపొందిన సమ్మక్కను ప్రతి రెండేళ్లకోసారి గద్దెపైకి తీసుకువస్తూ చందా వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు తల్లిని గద్దెపైకి తీసుకువస్తుండడంతో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. నేడు గ్రామంలోని పోచమ్మ, ఆంజనేయస్వామి, భూలక్ష్మికి పూజలు నిర్వహించనున్నారు. గ్రామంలోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా తోరణాలు కట్టి గ్రామ పొలిమేరల్లో గ్రామదిగ్బంధనం చేయనున్నారు.
తలపతులు సిద్దబోయిన చెలమయ్య, క్రిష్టారావు, ఆలెం సమ్మయ్య ఆధ్వర్యంలో చందా వంశీయులు చందా రఘుపతి, కల్యాణ్, స్వామి, శేషగిరి, గణేశ్ పూజలు నిర్వహిస్తారు. నేడు సాయంత్రం తలపతుల ఇంటిలో నుంచి తల్లి పూజామందిరంలోకి పసుపు, కుంకుమలను తీసుకురానున్నారు. గురువారం గ్రామసమీపంలోని గుట్టపై ఉన్న సొరంగంలో తల్లి రూపంలో ఉన్న కుంకుమ భరిణెను తీసుకొచ్చి సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించనున్నారు.