హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా పరిస్థితులను అనుసరించి సెలూన్ షాపు రేట్లు పెంచుతామని అందుకనుగణంగా జులై 4న హనుమకొండ చౌరస్తాలోని సెలూన్ షాపులన్నీ బంద్ చేస్తారని హనుమకొండ చౌరస్తా నాయిబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సింగారపు శ్యామ్, జంపాల వేణుగోపాల్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం హనుమకొండ చౌరస్తా లో పెరిగిన ధరల పట్టికను వారు ఆవిష్కరించారు. బంద్ సందర్భంగా కస్టమర్లందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీరాముల సుదర్శన్, తక్కెలపల్లి గంగాధర్, మొగిలిచర్ల ప్రసాద్, ఎనగందుల సతీష్, నిడిగొండ రమేష్, మురహరి రాకేష్, ముత్యాల వీరేంద్రనాథ్, జంపాల రాజయ్య, ఎలకంటి వెంకన్న, పుట్టపాక పవన్, ఎనగందుల రఘు పాల్గొన్నారు.