హనుమకొండ చౌరస్తా, మే 2: రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జాక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొదిల సాయిబాబా పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 90 శాతం అత్యధిక బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దోపిడీకి గురైందన్నారు.
అగ్రకుల అగ్రకుల జనాభా మొత్తం కలిపితే పట్టుమని 10 శాతం లేదు. కానీ ఈ 10 శాతం అగ్రకులాలు 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఆదిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బలగమంతా జాక్‌గా ఒక్కటై తెలంగాణలో మన రాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మేకల సుమన్, మైదం రవి, కట్కూరి సునీల్, కొట్టి ఏసోబ్, రోడ్డ మురళీకృష్ణ, చిలువేరు రవి, మాదాసి కుమారస్వామి, ఎర ప్రసాద్, సోమిడి నరేష్, కొత్తూరి జయపాల్, హరీష్, బొల్లె క్రాంతిరాజ్ పాల్గొన్నారు.