పాలకుర్తి ఫిబ్రవరి 16: పాలకుర్తిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనర సింహ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన చండి కా అమ్మవారి ప్రతిష్ఠాపనా మహోత్సవం గురువా రం కనులపండవగా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉషా దంపతులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, మంత్ర పుష్పనీరా జనం తదితర ఘట్టాలను శ్రద్ధతో చేశారు.
అద్భుత కేత్రం పాలకుర్తి: మంత్రి ఎర్రబెల్లి
స్వరాష్ట్రంలో ఆలయాలకు పునర్జీవం పోస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టను అద్భుత క్షేతంగా మలిచారని, ఆ దిశగా పాలకుర్తి క్షీరగిరి క్షేత్రంను జిల్లాలోనే దివ్యక్షేత్రంగా విలసిల్లు తుంద ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నిధు లు విడుదల చేశారని, వాటితో ఆయా చారిత్రక ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతంగా జరు గుతున్నాయని పేర్కొన్నారు. పాలకుర్తిలో సోమేశ్వరస్వామి సన్నిధిలో టూరిజం హోటల్ నిర్మాణానికి రూ. 25 కోట్లు సీఎం కేసీఆర్ విడుదల చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతర బ్రహ్మోత్స వాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
మహా అన్నదాన కార్యక్రమం
సోమేశ్వరాలయంలో నిర్వహించిన చండికా అమ్మవారి ప్రతిష్ఠాపన మహోత్సవం, జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం మంత్రి క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్లను పరిశీలించారు. స్వయంగా ఆయన భోజనం వడ్డించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే లు శంక ర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, భక్తులు వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన భరత నాట్యం పలువురిని అలరించింది.