Rahul Gandhi: నరవణే అబద్ధం చెబుతున్నారా?.. పెంగ్విన్ అబద్దం చెబుతుందా?
Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్‌లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్‌సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్‌ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. ఇంతకీ నరవణే అబద్దం చెబుతున్నారా లేక పెంగ్విన్ అబద్దం చెబుతుందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదాస్పదమైంది. ఆ బుక్‌లో ఉన్న కొన్ని అంశాలను ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తావించారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. వారం రోజుల నుంచి లోక్‌సభ వ్యవహారాలు సాగడం లేదు. అయితే ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే చేసిన ఓ ట్వీట్‌ను చదివి వినిపించారు. తాను రాసిన పుస్తకం ఆన్లైన్లో దొరుకుతోందని, లింక్ ఓపెన్ చేస్తే విషయాలు తెలుస్తాయని తన ట్వీట్లో నరవణే పేర్కొన్నట్లు రాహుల్ వెల్లడించారు. ఆ బుక్‌ను పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఇండియా ప్రచురించినట్లు తెలిసింది. కానీ తాము ఆ బుక్‌ను ఇంకా రిలీజ్ చేయలేదని పెంగ్విన్ సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నరవణే అబద్దం చెబుతున్నారా లేక పెంగ్విన్ సంస్థ అబద్దం చెబుతుందా అని అడిగారు. ప్రింట్లో కానీ, డిజిటల్ ఫార్మాట్లో కానీ తాము ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. కానీ రాహుల్ మాత్రం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెంగ్విన్ కన్నా మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను నమ్ముతున్నట్లు రాహుల్ తెలిపారు. నేను నరవణేను నమ్ముతున్నాను, ఆయన అబద్దం చెప్పరని భావిస్తున్నా, పెంగ్విన్ అబద్దం చెబుతుందా అన్న అంశంలో నిజాన్ని నిర్దారించలేమని రాహుల్ అన్నారు.
#WATCH | On Delhi Police files FIR to investigate alleged circulation of former Army chief General MM Naravane’s (Retd) unpublished book, LoP Lok Sabha Rahul Gandhi says,” Here is a tweet from Mr Naravane which says -“Just follow the link to my book”. The point I am making is -… pic.twitter.com/zeHbtzJpjJ
— ANI (@ANI) February 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

