హనుమకొండ చౌరస్తా, జనవరి 10 : ఆర్టీసీకి సం క్రాంతి పండుగ రద్దీ మొదలైంది. సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలు, విద్యార్థులతో వరంగల్ రీజియన్‌లోని బస్స్టేషన్లు సందడిగా మారాయి. హనుమకొండ బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పాఠశాలలు, కాలేజీలతో పా టు ఉద్యోగులకు రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం నుంచే పల్లెబాట పట్టారు. ము ఖ్యంగా హైదారాబాద్, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు, భూపాపల్లి, పరకాల పాలకుర్తి, నిజామాబాద్, ఖ మ్మం, నర్సంపేట వైపు రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆ యా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు.
ఒక్క హ నుమకొండ బస్టాండ్ నుంచే కాకుండా వరంగల్, ములుగురోడ్డు, వరంగల్ అండర్‌బ్రిడ్జి, పబ్లిక్‌గార్డెన్ ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు గ్రామాలకు తరలివెళ్లారు. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2, హనుమకొండ, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ డిపోల వారీగా సుమారు 700 వరకు అదనపు బస్సులు నడుపుతున్నారు.
బస్సులు లేక పాట్లు..
హనుమకొండ బస్టాండ్‌లో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానమైన వరంగల్-హైదరాబాద్ రూట్లోనే అదనపు బస్సులు తిప్పుతుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏం చేసేదిలేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.