హనుమకొండ చౌరస్తా : డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని డీటీవో వేణుగోపాల్ (DTO Venugopal ) సూచించారు. వరంగల్ రీజియన్ పరిధిలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం హనుమకొండ డిపోలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు.
సురక్షిత డ్రైవింగ్ చేసి జీరో ఆక్సిడెంట్ దిశగా సేవలందించాలని డ్రైవర్లకు సూచించారు. ఆర్ఎం విజయభాను మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజలలో ఆర్టీసీ పట్ల నమ్మకం పెంచాలని సూచించారు. హనుమకొడ డిపో మేనేజర్ ధరమ్‌సింగ్ మాట్లాడుతూ డ్రైవర్లు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతవాతావరణంలో డ్రైవింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు.