హనుమకొండ, సెప్టెంబర్ 30: ఉద్యోగ విరమణ జీవనంలో ఒక సహజ అంశమని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రాంచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం.సదానందం ఉద్యోగ విరమణ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాంచంద్రం మాట్లాడుతూ సమయపాలన, క్రమశిక్షణ వలననే వ్యక్తికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులే ప్రధానమని, వారికి అందించవలసిన సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపాల్ జే.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఇతర అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.