శాయంపేట జూన్ 18 : రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా చెట్లను నరికి పడేసిన కొమ్మలను ఎట్టకేలకు మంగళవారం తొలగించారు. శాయంపేట మండలం కొత్తగ ట్టు సింగారం-శాయంపేట ప్రధాన దారిపై హరితహారంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్ చెట్లను రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయని ఉపాధి కూలీలతో అధికారులు నరికి వేయించి కొమ్మలు అలాగే పడేశారు. రోజుల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 14న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘రోడ్డు ఇలా.. ప్రయాణం సాగేదెలా’ కథనానికి స్పందించిన కొత్తగట్టుసింగారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజమల్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం ఉపాధి కూలీలతో చెట్ల కొమ్మలను వేరే చోట వేయడంతో రోడ్డు శుభ్రంగా మారి రాకపోకలు సులువయ్యాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.