హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 2 : కాకతీయ యూ నివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఆర్ట్స్ కాలేజీ) పెండ్లి అశోక్‌బాబును సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి వీసీ ఆమోదంతో కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ, రెవెన్యూ శాఖ సర్వే పూర్తయిన నేపథ్యంలో తహసీల్దార్ రిజిస్ట్రార్‌కు రిపోర్ట్ పంపించారు. దీని ఆధారంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రిజిస్ట్రార్ మెమోలు జారీ చేశారు. పెండ్లి అశోక్‌బాబు సహా మిగిలిన ముగ్గురు మెమోకు ప్రత్యుత్తరాలను సమర్పించారు. ఇటీవలే రిజిస్ట్రార్ ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ దగ్గరకు వెళ్లగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహా మిగిలిన ముగ్గురిని సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
కేయూ పరిపాలనా భవనంలో గాంధీజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తుండగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు అకడికి చేరుకుని రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించాడు. కార్యక్రమంలో అశోక్‌బాబు గందరగోళాన్ని సృష్టించారని, ఆయన ప్రవర్తన యూనివర్శిటీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, వర్శిటీ గౌరవం, ప్రతిష్టకు భంగం కలిగించొద్దని సస్పెన్షన్ ఆర్డర్లో పేరొన్నారు. సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందన్నారు.
వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగ ల్యాబ్ అటెండెంట్ బుచ్చయ్య, పబ్లికేషన్ సెల్ వి భాగ వెయిటర్ ఎల్లస్వామిని సప్పెండ్ చేశారు. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీస్‌లో ఒప్పం ద డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదగిరికి టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.