మరిపెడ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలం చెందిందని, కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. చిన్నగూడూరు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం గురువారం మరిపెడ మండలం కేంద్రంలోని స్థానిక భార్గవ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకలను 10 లక్షల మందితో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వేడుకలకు మరిపెడ, చిన్న గూడూరు మండలంలో నుంచి పదివేల మంది సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా నాయకులు గ్రామాలలో పర్యటించి సభ ప్రాముఖ్యతను కార్యకర్తలకు తెలియజేస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని వీరారం రెవెన్యూ పరిధిలోని వెంకట నాయక్ తండ బొత్తల తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 100 మంది కార్యకర్తలు రెడ్యా నాయక్ సమీక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ ఓడిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అచ్యుతరావు, గుగులోతు వెంకన్న, రామ్ సింగ్, తాళ్లపల్లి శ్రీనివాస్, గాదె అశోక్ రెడ్డి, మాణిక్యం, రాంబాబు, రవీందర్, చెన్నారెడ్డి, ఉప్పల నాగేశ్వరరావు, మాజీ కోఆప్షన్ సభ్యులు అయూబ్ పాషా, లతీఫ్, కాలు నాయక్, బాలాజీ, ఉపేందర్, పిట్టల ధనుంజయ్ పాల్గొన్నారు.