లింగాల ఘణపురం : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ బ్రహ్మోత్సవాలను ఈనెల 4 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా సోమవారం జనగామ ఆర్డీవో గోపి రామ్ జీడికల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జాతరలో కీలకమైన తిరు కళ్యాణిని ఈనెల 10న నిర్వహిస్తున్నామన్నారు. తిరు కళ్యాణానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య తదితరులు హాజరవుతున్నట్లు ఆర్డీవో తెలిపారు. సమీక్ష సమావేశంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శివ శంకర్ రెడ్డి, ఈవో వంశీ,ఆర్ ఐ కిషోర్, సిబ్బంది కొండబోయిన భరత్ కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.