బచ్చన్నపేట డిసెంబర్ 8 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని రామచంద్రపురం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా మొదటి వార్డు సభ్యుడు నల్ల రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా ఎంఈఓ వెంకటరెడ్డి వ్యవహరించగా, గ్రామ సర్పంచ్ బొందుగుల వినోద్ రెడ్డి సహా ఎనిమిది మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి ఉప సర్పంచ్ కోసం పోటీ చేసే వారి పేరు ప్రకటించాలని చెప్పగా, వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా నల్ల వెంకటరెడ్డి పేరును ప్రతిపాదించారు. ఎవరు పోటీకి రాకపోవడంతో వెంకటరెడ్డిని ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ గా ఎన్నిక చేస్తూ నియామక పత్రం అందించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ వినోదరెడ్డితో కలిసి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉన్న నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని వార్డు సభ్యుల సహకారం, గ్రామస్తుల సలహాలు, సూచనలు తీసుకుంటూ జిల్లాలోనే ఆదర్శగాం తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజలకు మౌఇలక వసతుల కల్పనలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐదేళ్లలో గ్రామ రూపు రేఖలు మార్చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆముదాల లావణ్య, పొన్నెబోయిన బాలమణి, నర్మెట సుజాత, వేములవాడ నరేష్, ఒగ్గు ఆంజనేయులు, పెరుమాళ్ళ యాదగిరి, చొప్పరి మల్లేశం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.