ఖిలావరంగల్ : అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖిలావరంగల్ మధ్య కోటకు చెందిన దేనబోయిన రవి యాదవ్‌ను నియమించినట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గిరబోయిన రాజయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు బొల్లబోయిన కిషోర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా యాదవుల ఉన్నతి కోసం చేస్తున్న కృషిని గుర్తించి తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు.
కాగా, తన సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు కృషిచేసిన యాదవ సంఘాల ప్రతినిధులకు, బాధ్యులకు ఈ సందర్భంగా రవి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.