న్యూశాయంపేట, మే 21: నగరంలోని మెడికవర్ దవాఖానలో ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాలు, నిపుణుల సహకారంతో రెండు అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ డి.శిరీష్ భరద్వాజ్ తెలిపారు. నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో మూత్రపిండం తొలగించాలన్న సలహాలు ఇచ్చిన సందర్భంలో మూత్రపిండాన్ని కాపాడుతూ ఒకే సమయంలో ‘సుపైన్ పీసీఎన్ఎల్’ ఓపెన్ సుప్రాప్యూబిక్ సిస్టోలిథోటమీను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
రోగి ఆరు నెలలుగా తీవ్రమైన మూత్రవిసర్జన సమస్యలు, దిగువ మూత్రపథం లక్షణాలు సుప్రాప్యూబిక్ నొప్పితో బాధపడ్డాడని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ మెడికవర్ వైద్యబృందం మూత్రపిండాన్ని తొలగించకుండా రక్షించే వ్యూహం చేపట్టిన తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు సాధారణమైనవే కావచ్చు కానీ ఒకే సెషన్లో ఒకే సర్జన్ చేత, రోగిని తిరిగి ఉంచకుండా సుపైన్ పీసీఎన్ఎల్ పద్ధతిలో నిర్వహించగలగడం ఒక ప్రత్యేకమని పేర్కొన్నారు. మూత్రపిండాన్ని రక్షించగలగడం ఈ శస్త్రచికిత్స విజయానికి అసలైన విజయం అని డాక్టర్ శిరీష్భరద్వాజ్ తెలిపారు.