హనుమకొండ( ఐనవోలు): వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.
ఇదే సమయంలో రాంనగర్ గ్రామానికి చెందిన రైతులు తరుగు పేరుతో మిల్లర్లు రైతుల దగ్గర నుంచి అధిక కట్టింగులకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యేను నిలదీశారు. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా తనకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఖాతాలో ఇంకా జమ కాలేదంటూ నిలదీశారు. దీంతో సభలో గందరగోల పరిస్థితి నెలకొంది. సొసైటీ, పోలీస్ అధికారులు కలగజేసుకోవడంతో సమస్య సద్దుమనిగింది.