హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 24 : పిల్లలలు, మహిళలకు దేశంలోనే అత్యున్నత వైద్యసేవలు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అందిస్తున్నదని రెయిన్బో చిల్డ్రన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ చీర్ల దినేష్‌కుమార్ అన్నారు. హనుమకొండ నయీంనగర్‌లో రెయిన్బో 20వ హాస్పిటల్‌ను వారు ప్రారంభించి మాట్లాడారు. పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ (శిశు సంరక్షణ), పెరినాటల్ కేర్ (గర్భిణి వైద్య సేవలు) దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ అత్యుత్తమ వైద్య సేవలను విస్తరించడంలో భాగంగా 20వ హాస్పిటల్‌ను ఇక్కడ ప్రారంభించిందన్నారు.
వరంగల్ నగరంలో నమ్మకమైన వైద్యసేవలను అందిస్తున్న ప్రశాంతి హాస్పిటల్ వేదికగా సంయుక్త భాగస్వామ్యంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ నూతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువ చ్చిందని, ప్రస్తుతం పీడియాట్రిక్ కేర్ కోసం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయబడిందన్నారు. ఈ ప్రయత్నం వరంగల్‌లకు అధునాతన పీడియాట్రిక్, నియోనాటల్, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలను తీసుకువస్తుందన్నారు.
ప్రధానంగా మహిళల సంరక్షణ కోసం రెయిన్బో ద్వారా మాతా-శిశు సంరక్షణలో కీలకపాత్ర పోషించే ‘బర్త్ రైట్’ను ప్రశాంతి హాస్పిటల్ సైతం పొందుతోందని, వరంగల్ వాసులకు ఇది కేవలం మార్పు మాత్రమేకాదు.. మాతా శిశు సంరక్షణలో విశేష అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తుందన్నారు.
రెయిన్బో ఆధ్వర్యంలో ప్రశాంతి హాస్పిటల్ వేదికగా 100 పడకలలతో అప్‌గ్రేడ్ చేయబడి, ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన ఈ సౌకర్యం.. అధునాతన ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవలతో పాటు పీడియాట్రిక్ సబ్-స్పెషాలిటీలు మరింత మెరుగైన వైద్య సేవలను అందించనున్నట్లు, అలాగే హై-రిస్క్ ప్రెగ్నెన్సీకేర్(క్లిష్టమైన ప్రసవాలకు సురక్షితంగా అందించే చికిత్స), ప్రధానంగా పిల్లలు, మహిళలకు 24/7 గంటలు అత్యవసర సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ప్రశాంతి హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మచ్చా మాట్లాడుతూ.. ప్రశాంతి హాస్పిటల్ ఎల్లప్పుడూ మహిళలు, పిల్లల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని, రెయిన్బోతో ప్రస్తుత భాగస్వామ్యం వలన వైద్య ప్రమాణాలు మరింత బలోపేతం చేయడానికి తోడ్పాటును అందిస్తోంది. అంతేకాకుండా ఈ అధునాతన సౌకర్యాలతో పాటు దేశంలోని అత్యుత్తమ వైద్య నిపుణులతో పేషెంట్స్‌ను అనుసంధానించేలా చేయనున్నట్లు తెలిపారు.
ఇది సామాజిక ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించడానికి వీలు కల్పిస్తుందన్నారు. రెండు దశాబ్దాలకుపైగా అనుభవం, విభిన్న నగరాల్లో అత్యుత్తమ వైద్య సేవలతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గ్రూప్ దేశంలోని పిల్లల, ప్రసూతి ఆరోగ్య సంరక్షణలో ముందంజలో ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ప్రీడియాట్రిషియన్ డాక్టర్ ప్రీతమ్కుమార్రెడ్డి ఉన్నారు.