కాజీపేట, జులై 10: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, భక్తులు, ఐఆర్టిసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైలును తీర్థ యాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్టిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప.వి వెంకటేష్ సూచించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 19 తేదీ నుండి జూలై 26 వ తేదీ వరకు ప్రత్యేక ప్యాకేజీని ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగంతో (తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి తంజావూరు) దైవ దర్శనాలను చేయించన్నుట్లు తెలిపారు. ఈ యాత్రలో పెద్దలు ఒక్కరికి సాధారణ టికెట్ ధర రూ.14100, 3 ఏసీ ధర రూ.22300, 2 ఏసీ ధర 29200 రూపాయల చొప్పున ఉంటుందన్నారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్లో బయలుదేరి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లో నిలుస్తుందని తెలిపారు.
రైలులో 639 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకురుస్తామని వివరించారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. ఈ యాత్ర రైలు టికెట్ బుక్ చేసుకునే యాత్రికులు పూర్తి వివరాలకు 9701360701, 9281495845, 9281495843, 9281030749 నంబర్లలో లేదా www.irctctourism.com వెబ్ సైట్ ని సంప్రదించాలని కోరారు. ఈ సమావేశం లో టూరిజం అధికారులు ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.