రామప్పలో వియత్నాం దేశస్తులు
ప్ర పంచ వారసత్వ కట్టడం రామప్పను శనివారం వియత్నాం దేశానికి చెందిన 26 మంది సందర్శించారు. ఆదేశ ఉన్నతాధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, జర్నలిస్టులు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ఈ నెల 18నుంచి 30 వరకు వరకు శిక్షణ తీసుకునేందుకు వచ్చారు.
వెంకటాపూర్, మార్చి 23 : ప్ర పంచ వారసత్వ కట్టడం రామప్పను శనివారం వియత్నాం దేశానికి చెందిన 26 మంది సందర్శించారు. ఆదేశ ఉన్నతాధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, జర్నలిస్టులు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ఈ నెల 18నుంచి 30 వరకు వరకు శిక్షణ తీసుకునేందుకు వచ్చారు. ఇందులో భాగంగా మన చరి త్ర, వారసత్వ కట్టడాల గురించి తెలుసుకోవడానికి రామప్ప, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడిని సందర్శించారు.
అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, టూరిజం గైడ్లు వివరించగా ఆసక్తిగా పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఎస్సై చల్ల రాజు, ఆర్ఐ రమేశ్, ఎంసీహెచ్ఆర్డీ అధికారు లు వడ్ల శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

