బచ్చన్నపేట జూన్ 01: నిరుపేద కుటుంబానికి చెందిన రాపెల్లి నాగలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్వోసీని అందజేశారు. వివరాళ్లోకి వెళ్తే..బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన రాపెల్లి నాగలక్ష్మికి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుడుతున్నది. విషయం తెలుసుకున్న కిరణ్ కుమార్ బీసీ సంక్షేమ రవాణ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి రెండు లక్షల యాబై వేల రూపాయల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఎల్వోసీ మంజూరు పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకత్ కిరణ్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగాని బాలకిషన్, గోలి బుచ్చిరాజు, వెంకటేశం, పంది పెళ్లి ఎల్లారెడ్డి, లక్కర్స్ శ్రీకాంత్, సదానందం, శాంతయ్య, జనగామ బ్లాక్ అధ్యక్షులు దూడల సిద్ధయ్య గౌడ్, మాజీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి జనగాం మండల ప్రెసిడెంట్ బాలనీ నరేష్, యూత్ ఓబీసీ ప్రెసిడెంట్ జనగాం వెంకట్, ఓబిసి జిల్లా కన్వీనర్ రామకృష్ణ, అవధూత శ్రీనివాస్ రాపల్లి వెంకటేష్, మచ్చ భగవాన్, సిమ్ముల సుధాకర్ రెడ్డి, పాతూరి రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,మోహన్ రెడ్డి, రాపల్లి రామచంద్రం, రాగిశెట్టి అబ్బ సాయిలు, కిచెన్ జంగిడి సిద్ధులు, మరియు బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.