కాళేశ్వరం, జూలై 9 : తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని మహారాష్ట్ర నేతలు కితాబునిచ్చారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి లక్ష్మీబరాజ్ వద్దకు రాగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు స్వాగతం పలికి బరాజ్‌ను చూపించారు. అనంతరం మ్యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, లక్ష్మీ బరాజ్, లక్ష్మీ పంప్‌హౌస్ గురించి వివరించారు. అక్కడినుంచి లక్ష్మీ పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటర్లు, గోదావరిలో నీటిని పరిశీలించారు. పంప్‌హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లి మోటర్ పైపుల నుంచి పోస్తున్న కాళేశ్వర జలాలను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడినుంచి గ్రావిటీ కెనాల్ వెంట పరిశీలిస్తూ సరస్వతి బరాజ్‌కు చేరుకొని ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు, మోటర్లు నడిచే తీరు, పంప్‌హౌస్‌ల నుంచి దుంకుతున్న జలాలను తిలకించి పులకించిపోయారు.
జల ప్రదాత సీఎం కేసీఆర్
మహదేవపూర్ : కాళేశ్వర జలాలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ వివరాలను ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వారికి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనతికాలంలోనే పూర్తయి రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పాయన్నారు. కాళేశ్వరం జలాలు పారిశ్రామిక అవసరాలను తీరుస్తూ లక్షలాది ఎకరాలకు సాగు నీరందిస్తున్నదని తెలిపారు. సముద్రంలో వృళాపోయే నీటిని ఒడిసిపట్టి ప్రజల అవసరాలను తీరుస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్నింటా దూసుకుపోతున్నదని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో ఈఈ తిరుపతిరావు, డీఈఈ సురేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
కేసీఆర్ దార్శనికత అమోఘం
అపర భగీరథుడిగా గోదావరి జలాలను అదిమిపెట్టి ఎదురెక్కి పారించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు భానుదాసు ముర్కుటే, అన్నాసాహెబ్ మానే, ఘన్‌శ్యామ్ కొనియాడారు. ఆయన దార్శనిక పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఇంత తక్కువ సమయంలో అసాధ్యం అనుకున్న భారీ ప్రాజెక్టును నిర్మించి దేశానికి సవాల్‌గా నిలిచారన్నారు. ఒక రాష్ర్టానికి నాయకుడిగానే ఇంత అభివృద్ధి చేస్తే భారతదేశానికి ప్రధాని అయితే ఇంకెంత ప్రగతి సాధిస్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు దేశంలో మరెక్కడా సాధ్యం కాదని అది ఒక తెలంగాణకే దక్కుతుందని వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దం పడు తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మైనార్టీ నాయకులు ఖదీర్ మౌ లానా, బంజారా నేత ప్రహ్లాద్ రాథోడ్, సర్పంచ్ శరద్‌పవార్, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్‌రావు, కన్నారావు ఉన్నారు.