హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23: పరిశోధనలలో స్టాటిస్టికల్ మెథడ్స్ప్రధాన భూమిక వహిస్తాయని విశ్రాంత అర్థశాస్త్ర విభాగ ఆచార్యులు, పూర్వపు రిజిస్ట్రార్ ఎ.సదానందం అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన మానవ వనరుల విభాగం విభాగాధిపతి ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘వారం రోజుల రీసెర్చ్ మెథడాలజీ కార్యక్రమం’ మూడో రోజున పరిశోధకులను ఉద్దేశించి ‘పరిశోధన పద్ధతులు-స్టాటిస్టికల్ మెథడ్స్’ అనే అంశంపై ప్రసంగించారు.
పరిశోధకులు తమ పరిశోధనలు నిస్పాక్షికంగా జరగపాలని, వాస్తవ పరిస్థితులను తమ పరిశోధనలో వెల్లడించాలన్నారు. విషయ ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వపాలన సహాయ ఆచార్యులు చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆకుతోట శ్రీనివాసులు, అధ్యాపకులు చీకటి శ్రీను, బుర్రి ఉమాశంకర్, ఒడ్డేపల్లి మోహన్, బండి శ్రీనివాస్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.