హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6: పవర్ బీఐ నైపుణ్యాలతో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.అమరవేణి అన్నారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో డేటా ఆధారిత నిర్ణయాలు కీలకమైపోయాయని ఈ నేపథ్యంలో ‘పవర్ బీఐ’ వంటి బిజినెస్ అనలిటిక్స్సాధనాలపై పట్టు ఉండటం విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించగలదని తెలిపారు. శనివారం కాలేజీ సెమినార్‌హాల్‌లో యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల ఎంబీఏ, ఎంకాం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ పవర్ బీఐ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
పవర్ బీఐ ద్వారా డేటాను విశ్లేషించడం, వ్యాపార నిర్ణయాలలో స్పష్టత తీసుకురావడం, ముందస్తు అంచనాలు వేయడం, వ్యూహాత్మక ప్లానింగ్‌లో వాటివలన కలిగే ప్రయోజనాలపై వివరించారు. కామర్స్విభాగ డీన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ మాట్లాడుతూ నేటి మార్కెట్లో ఇలాంటి అనలిటిక్స్నైపుణ్యాలపైనే ఆధారపడుతోందని, ఎంబీఏ, ఎంకాం విద్యార్థులకు ఇవి ప్రాంగణ నియామకాలలో (క్యాంపస్ ప్లేస్ మెంట్స్) అత్యంత ఉపయోగకరమని తెలిపారు. కాలేజీ పూర్వవిద్యార్థి దండు నవకిరణ్, పవర్ బీఐపై ప్రాక్టికల్ ఉదాహరణలు, కేస్ స్టడీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, ఎస్.నరసింహచారి, ఫణీంద్ర కటకం, ప్రగతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.