వరంగల్‌చౌరస్తా/ఖిలావరంగల్/కరీమాబాద్/పోచమ్మమైదాన్, డిసెంబర్ 24: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్‌లు కట్ చేసి క్రైస్తవులకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్ కమ్యూనిటీ హాల్ భవనంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ క్రిస్టియన్లకు కానుకలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో సర్వమత సమానత్వాన్ని సాధంచడం బీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన ముందుచూపు చర్యలు ప్రస్తుతం దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నాయన్నారు.
ఖిలావరంగల్ పడమరకోటలో 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ ఇంటింటికీ వెళ్లి కానుకలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన సొంత ఖర్చులతో 50 మంది పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దామోదర్, శ్రీనివాస్, రాజేశ్, ప్రగత్, రమేశ్, కనకరాజు, సుమన్, వంశీ పాల్గొన్నారు. కరీమాబాద్ 32వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ పల్లం పద్మ కేక్ కట్ చేశారు. అనంతరం కార్పొరేటర్ దంపతులను సత్కరించారు. జవాన్లు జీవన్, గాదె కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఉర్సులోని చర్చిలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ లబ్ధిదారులకు కానుకలు అందించారు. పోశాల స్వామి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు. వరంగల్ 21వ డివిజన్ డీసెంట్ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో అతడి తల్లిదండ్రులు నారాయణ-వెంకటనర్సమ్మ జ్ఞాపకార్థం గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ నేతృత్వంలో క్రిస్టియన్ మతపెద్దలకు శ్రీనివాస్ దుస్తులు పంపిణీ చేశారు. ముందుగా వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రావేళ్ల రామారావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఫాస్టర్లు పాల్ ముస్తఫా, కాకిలేటి అబ్రహం, మడిపెల్లి లేవి, గంధం అరుణ్ జేమ్స్, భాష్పాక ఏలియా, ఎమ్మెస్ రాజు, ఆనంపల్లి అబ్రహం, జన్ను ప్రభాకర్, బీ కాలేబు, జూపాక యాకోబ్, సాల్మన్, రాజ్, మహేందర్, సందెల లాజర్, కిన్నెర రవి, వీణవంక కిరణ్ పాల్గొన్నారు.
ప్రీక్రిస్మస్ వేడుకల్లో భాగంగా 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన తన ఇంటి ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, జేపీఎన్ రోడ్డులోని పూర్ణోదయ పబ్లిక్ స్కూల్‌లోక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. నర్సంపేటలోని అక్షర పాఠశాలలో మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ అండృరాజేంద్రప్రసాద్రెడ్డి కేక్ కట్ చేశారు. మంచి మనసుతో దేవుడిని ఆరాధించాలని ఆయన కోరారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో కాపీర్నేహోమ్ బాప్టిస్ట్ చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ వక్కల మల్లక్క, వక్కల చంద్రమౌళి, ఓదెల రవి, కుసుంబ శ్రీను, మేకల రమేశ్, మేరుగు లింగమూర్తి, మాట్ల మహేశ్, గుండాల రాజకొమురయ్య, తిప్పారపు రాంబాబు, ముత్తినేని మంగ నర్సయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ గురుకుల విద్యాలయంలో మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ప్రిన్సిపల్ కరుణాకర్‌రెడ్డి, జక్కుల జగదీశ్వర్, మేడి రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరంలోని సెయింట్ మేరీ హైస్కూల్లో భారీ కేక్‌ను ఫాదర్ ప్రకాశ్‌రెడ్డి కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు.