ఖిలావరంగల్: ఖిలా వరంగల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అలాగే మధ్య కోట ఖుష్ మహల్ సమీపంలో రైతు తోట జగన్ వ్యవసాయ భూమిలోని చింత చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో రూ.1.20 లక్షల విలువ కలిగిన ఆవు, దూడ మృతి చెందాయి.
కాగా, రైతును కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్ పరామర్శించారు. అలాగే రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించగా ఖిలా వరంగల్ పశు వైద్యశాల డాక్టర్ కిరణ్ ఆవు, దూడకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రైతు తన పొలంలోనే ఆవు దూడ కళేబరాలకు అంత్యక్రియలు నిర్వహించాడు.