ఏటూరు నాగారం : ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ప్రతి గ్రామం నుంచి సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సభకు హాజరుకానున్నరని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నిర్విరామంగా పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈనెల 27వ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఖాజా పాషా, తాడూరి రఘు, దన్నపునేని కిరణ్, కాళ్ల రామకృష్ణ, జాడి బోజారావు, బాస పుల్లయ్య, బండి లక్ష్మి, స్వరూప,మాజీ ఎంపీపీ విజయ, గండేపల్లి నర్సయ్య, పాలకుర్తి విజయ్, దేవక శ్రీరామ్, వావిలాల పోశయ్య, మందపల్లి చంద్రం, సమ్మిరెడ్డి, దడిగల లక్ష్మణ్, బోడ శంకర్, వావిలాల కిశోర్, రాజేష్,రాజు బాస శరత్ తదితరులు పాల్గొన్నారు.