ఏటూరు నాగారం : మండల కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి ఎక్కిల గ్రామానికి వెళ్లే రహదారిని పోలీసులు గురువారం మరమ్మతులు చేశారు. జాతీయ రహదారి నుంచి ఉన్న రోడ్డుకు మధ్య గుంతలుగా ఉండటంతో పోలీసులు రోడ్డుపై నుంచి తొలగించిన బీటీ చూర మట్టి తో గుంతలను పూడ్చివేశారు. ఇక్కడ రోడ్డు దిగే క్రమంలో గుంతలు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సమాజ సేవలో భాగంగా ఈ పని చేశారు. స్థానిక ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో రోడ్డు మరమ్మతు చేశారు రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మరమ్మతు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయి మరింత గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ట్రాక్టర్లలో మట్టి తెప్పించి జెసిబితో చదును చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాత్రివేళ ప్రయాణంలో వేగం తగ్గించుకోవాలని ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మద్యం తాగిన తాగిన తర్వాత డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ సీటు బెల్టు ధరించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను కోరారు. పోలీసులు మరమ్మతులు చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.