కరీమాబాద్, మార్చి 9: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా సిబ్బంది మాత్రం ఆచరణలో చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అయ్యా.. నాకు న్యా యం చేయాలి’ అంటూ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వస్తే చాలు.. విచారణ పేరుతో కేసులను పెండింగ్‌లో పెడుతూ పోలీసులు పబ్బం గడుపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చెప్పులు అరిగేలా స్టేషన్ల చు ట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పం పించాలని, అక్కడైనా తేల్చుకుంటామని వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు.. నిందితులను స్టేషన్‌కు పిలిపించి నయానో.. భయానో మాట్లాడుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టేందుకు వెళ్లిన వారే అరిగోస పడుతున్నట్లు చర్చించుకుంటున్నారు.
ఫిర్యాదు చేసి పది నెలలు గడిచినా..
భూ వివాదంలో ఖిలావరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేసి దాదాపు పది నెలలు గడుస్తున్నా నేటికీ విచారణ పూర్తి కాలేదు. దీంతో సదరు వ్యక్తి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. పైగా కూర్చొని మాట్లాడుకోవాలని ఉచిత సలహా సైతం ఇచ్చినట్లు సమాచారం. దీంతో బాధితుడు సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అలాగే, ఓ తల్లి తన కొడుకు డబ్బులు లాక్కున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మా.. నీకు న్యాయం చేస్తామని చెప్పిన అధికారి బాధితుడిని స్టేషన్‌కు పిలిచి మాట్లాడాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మరుసటి రోజు నుంచి అధికారి మాటలో తేడా వచ్చిందని తల్లి పేర్కొంది. కుటుంబ విషయంలో కేసు ఎందుకని, పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో బాధితురాలు సైతం సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
కరీమాబాద్‌లో ఓ వ్యక్తి తనను కొట్టాడని ఫిర్యాదు చేస్తే.. అతడికి కూడా ఉచిత సలహా ఇచ్చినట్లు భోగట్టా. ఇటీవలే ఓ భూ వివాదంలో బాధితుడు కోర్టును ఆశ్రయించగా, వివరణ ఇవ్వాలని కోర్టు మిల్స్‌కాలనీ పోలీసులను కోరిన విషయం తెలిసిందే. తాజాగా శివనగర్ ప్రాంతంలోని భూ వివాదంలో ఫిర్యాదు చేసిన బాధితుడు సైతం తిరిగి కోర్టును ఆశ్రయించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. తన భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తే తనను బెదిరిస్తున్నాడని ఓ వృద్ధుడు ఫిర్యాదు చేస్తే తనను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే మిల్స్‌కాలనీ పోలీసుల లీలలు కోకొల్లలు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.