ఏటూరునాగారం, డిసెంబర్ 7 : వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించబోయే మేడారం మహా జాతరకు సంబంధించిన పనులు, నిర్వహణపై గురువారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో అంకిత్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, ఐసీఏడీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, దేవాదాయ శాఖ ద్వారా గుర్తించిన సివిల్ పనులపై చర్చించారు. ఎంసీసీ కోడ్ పూర్తయిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో వివిధ విభాగాల ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.