JNS | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 20 : వరంగల్లో టెన్నికాయిట్ క్రీడకు ప్రాధాన్యత ఉందని, హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో శాశ్వత టెన్నికాయిట్ కోర్టులు వేయించి టెన్నికాయిట్ క్రీడకు సహకరిస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఐడియల్ స్కూల్లో 9వ రాష్ర్ట స్థాయి టెన్నికాయిట్ సెలక్షన్స్ ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ అగర్వాల్, జాతీయస్థాయి క్రీడాకారుడు సద్గురు, ఆర్టిఐ మెంబర్ సతీష్, కార్పొరేటర్ మానస-రాంప్రసాద్, టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ర్ట కోశాధికారి అల్వాల రాజకుమార్, వరంగల్ జిల్లా సెక్రెటరీ గోకారపు శ్యాంకుమార్, ఐడియల్ స్కూల్ విద్యాసంస్థల యాజమాన్యం సర్ఫరాజ్ ఫెరోజ్ పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలోఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడాకారులను గౌరవిస్తూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. 23 జిల్లాల నుంచి 250 మంది బాలబాలికలు పాల్గొన్నారని, ఇందులో ప్రతిభ కనబర్చినవారు ఈనెల 26 నుంచి 28 వరకు జమ్ముకాశ్మీర్లో జరిగే జాతీయస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ర్ట కోశాధికారి అల్వాల రాజకుమార్, వరంగల్ జిల్లా సెక్రెటరీ గోకారపు శ్యాంకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన టెన్నికాయిట్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి జాతీయస్థాయిలో పతకాలు తీసుకురావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.