హనుమకొండ, మార్చి 12 : బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగకు ఓరుగల్లు వేదిక కావడం ఆనందంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ది ప్రత్యేక స్థానమని, కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊ హించలేమన్నారు. మోదీ కోవర్టు సీఎం రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఉద్యమ సమయంలో నీ చేతిలో, నీ ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి చేతిలో పిస్టల్, రైఫిల్ ఉన్నదన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ ఉద్యమించకపోతే నువ్వు ఎమ్మెల్యే, రేవంత్‌రెడ్డికి సీఎం పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను విమర్శించే స్థామి మీది కాదన్నారు. మీరిద్దరు కూడా ఉద్యమ సమయంలో ఉద్యమ ద్రోహులకు సద్దులు కట్టి ద్రోహం చేయడంతో పాటు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిన సంఘటనను తెలంగాణ సమాజం మరచిపోదన్నారు. మానుకోట ఘటన జరిగినప్పుడు మీరిద్దరు ఎకడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రపంచమే అబ్బురపోయేలా సభలు సమావేశాలు నిర్వహించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. చిల్లర మాటలు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని నాయినికి హితవు చెప్పారు. 25 ఏండ్ల పండుగ జరుపుకొంటున్న వేళ విమర్శలు చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
ప్రతి సారి అభివృద్ధి గురించి మాట్లాడుతున్న రాజేందర్‌రెడ్డి నగరాన్ని నువ్వేదో నిర్మించినట్లు మరో చంద్రబాబులా మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితితో మీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేక పోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్‌పై వస్తోందన్నారు.
నిర్మించిన ప్రాజెక్టులకు రూ.5 కోట్ల నిర్వహణ నిధులు విడుదల చేయలేని అసమర్థులు మీ మంత్రులని ఆయన ఎద్దేవా చేశా రు. దేవాదుల ప్రాజెక్టు పడకేసింది.. జనగామ ఎండిపోతోం ది, డోర్నకల్, భూపాలపల్లిలో పచ్చని పైరులు ఎండిపోతూ పశుగ్రాసంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక చోట కూర్చొని మా ట్లాడుకోలేని మీరు కూడా మా పార్టీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ 15 నెలల్లో చేసిన అవినీతిపై కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయని, హైకోర్టులు నోటీసులు ఇస్తే కూడా సమాధానం లేదని, మంత్రులు ధాన్యం కొనుగోళ్లలో అవినీతి సొమ్ము వాటాలపై కేసులు కూడా నడుస్తున్నాయని విమర్శించారు.
నాడు బీఆర్ఎస్ హయాం లో కేటీఆర్ నాయకత్వంలో ఏడాదిలో రూ.1,250 కోట్ల ఆదా యం వస్తే, నేడు ఇసుక మేటల్లో కాంగ్రెస్ నాయకుల వాటాలతో ఆదాయం 150 నుంచి 200 కోట్లు దాటడం లేదన్నా రు. హరీశ్‌రావు ప్రెస్మీట్లో కాంగ్రెస్ నాయకుల గురించి పల్లెత్తు మాట అనలేదు.. ఉలికపడకు రాజేందర్‌రెడ్డి.. మా ర్పు కోణంలో నువ్వు గెలిచావు.. కానీ ప్రజలు ఇప్పుడు తల లు పట్టుకుట్టున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 25 ఏండ్ల పార్టీ పండుగను వరంగల్ కేంద్రంగా గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరం కలిసి పనిచేసి సభను విజయవంతం చేస్తామని పెద్ది అన్నారు.
స్వరాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ముఖ్య భూమిక పోషించింది. వరంగల్ జిల్లాను అభాసుపాలు చేసేందుకు కొందరు నాయకులు బయలుదేరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి 16 నెలల బాలుడని, ప్రపంచమంతా తెలుసు, ఈ నగరం గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెల్వదని ఎకువ ఊహించుకుంటున్నాడు. ప్రజలు శాసన సభ్యుడిగా అవకాశం ఇచ్చారు సమస్యలపై దృష్టిపెట్టు. మున్సిపాలిటీలో అవినీతి ఎక్కువైందని అంటున్నావు.. నీ నియోజకవర్గం కూడా మున్సిపాలిటీలో ఉంది. అంటే మీ పని విధానాన్ని, తార్కానం నువ్వే ఒప్పుకున్నావు. అవినీతి జరుగుతుందని నీవే చెబుతున్నావు. రాసిపెట్టుకో.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వేమే. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్, రవీందర్రావు, జానకీరాములు, రఘు, వెంకన్న, రామ్మూర్తి పాల్గొన్నారు.
– మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్