నర్సంపేట, జూలై 16 : నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్‌పై గురువారం మట్టి మాఫియా దాడికి తెగబడింది. కర్రలు, రాళ్లతో విరుచుకుపడడంతో గాయాలకు గురైన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని నాగుర్లపల్లిలో ఒక వ్యక్తి చనిపోగా దహన సంసారాలు జరుగుతున్నాయి. ఇదే స మయంలో మట్టి ట్రాక్టర్లు దహన సంస్కారాలకు ఇబ్బంది కలిగించేలా వెళ్తుండడంతో 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్‌నాయక్ కొద్దిసేపు వాటిని ఆపాలని కోరాడు.
దీంతో కోపోద్రి క్తులైన మట్టి మాఫియా వ్యక్తులు ఒర్సు రాజు, మాధన్నపేట 1వ వార్డు కౌన్సిలర్ భర్త కొత్త కొండ శ్యామ్, ముత్తిలింగంతో పాటు మరో ఏడుగురు నవీన్నాయక్పై కర్రలు, రాళ్లతో విచక్ష ణా రహితంగా దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించినట్లు బాధితుడు తన ఫిర్యా దులో పేర్కొన్నాడు. కాగా, ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో మట్టి మాఫియా ఆగడాలకు గురైన నాగుర్లపల్లికి చెందిన కందికొండ కిరణ్ ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
మట్టి మాఫియాను ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై జరుగుతున్న దాడులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కౌన్సిలర్ నవీన్‌నాయక్‌ను పరామర్శించిన ఆయన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారన్నారు.
దాడులకు పాల్పడుతున్న మట్టి మాఫియాపై కొత్త సీపీ శ్వేత ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్ది కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మండల మాజీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, మచ్చిక నర్సయ్యగౌడ్, నాయకులు వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, గోనె యువరాజ్, మండల శ్రీనివాస్, ప్రసాద్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు, దొమ్మాటి సంతోష్ తదితరులున్నారు.