నర్సింహులపేట, మే 2: అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో యాకయ్యకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామసభలో తమ పేర్లు చదివారని, ఇందిరమ్మ కమిటీ వచ్చిన తరువాత అవి లేకుండాపోయాయని అన్నారు.
భూస్వాములు, ఎకరాల భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. అర్హులైన వారికి కాకుండా లీడర్లు కుమ్మకై తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అర్హుల జాబితా లేకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మందు బద్రీనాథ్, వినోద్ కుమార్, మల్లయ్య, శ్రీను, వెంకన్న, ఉప్పలయ్య, రాములు, పర్శరాములు ఉన్నారు.