హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9: టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక మంది విద్యార్థులు టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. సాధారణంగా ప్రతి సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నోటిఫికేషన్ విడుదలవుతుండగా ఈసారి అది ఆలస్యమతుందని పేర్కొన్నారు.
పీజీ సెట్ మెంబర్ నరేష్ కుమార్ రెడ్డి ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్టార్ గా నియమిం చబడినప్పటికి నోటిఫికేషన్ విడుదలకు ఆలస్యం జరుగుతోందన్నారు. తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం సెట్ లేదా నెట్ అర్హత అవసరం. ప్రత్యేకంగా ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలో బోధనకు సెట్ అర్హత ఉన్న అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు టీజీ సెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెంటనే చర్యలు చేపట్టి నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉడత గణేష్, నాయకులు రమేష్, పవన్, కళ్యాణ్ పాల్గొన్నారు.