హనుమకొండ, మే 6 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన ఉమ్మడి జిల్లా బృందాన్ని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. మంగళవారం తెలంగాణ భవన్లో వరంగల్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్ వరంగల్ సభ సక్సెస్, ఇతర అంశాలను, అనుభూతులను పంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి భారత రాష్ట్ర సమితి 25 ఏళ్ల ఉత్సవం వరకు వరంగల్ కేంద్రంగా ఏ సభ నిర్వహించినా చరిత్రకెకిందని, ఇది కూడా ఆ తరహాలోనే చరిత్రలోకి ఈ సభ ఎకబోతుందని కేటీఆర్ పేరొన్నారు. తెలంగాణ ఉద్యమ ఉనికి, భావజాల వ్యాప్తి, పార్టీ నిర్వహించిన బహిరంగ సభలన్నీ వరంగల్ సభలతో పోల్చుకునేలా జన సమీకరణ చేశారని, లక్షలాది పార్టీ కార్యకర్తలకు సకల సౌకర్యాలు కల్పించారని చెప్పారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ నేతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమన్వయం చేస్తూ సభ విజయవంతానికి కృషిచేశారని, నిర్వహణలో పొరపాట్లు లేకుండా ముందుకుసాగారని కేటీఆర్ అభినందించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.