వరంగల్ లీగల్: పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధిగా నడుచుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి తెలిపారు. రెండు రోజుల పాటు పారా లీగల్ వలంటీర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ముగింపు వేడుకల్లో జడ్జి పాల్గొని మాట్లాడారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను, చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. న్యాయ సేవాధికార సంస్థల విధులను, లక్ష్యాలను ప్రజలకు తెలియజెప్పి, ఏ పౌరుడు న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. రెండు రోజుల శిక్షణ పొందిన వాలంటీర్లకు గుర్తింపు కార్డులను జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అందించారు.
శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్లుగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ సుధాకర్ (రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్), బి.విజయలక్ష్మి సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఆక్ట్, పోక్సో ఆక్ట్, డి.వి.సి. ఆక్ట్, ), డిప్యూటీ డైరెక్టర్-పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.సత్యనారాయణ (షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆక్ట్), పబ్లిక్ ప్రాసిక్యూటర్ భధ్రాద్రి (ఎఫ్.ఐ.ఆర్. బెయిల్, అరెస్ట్, రైట్స్ ఆఫ్ ప్రిసనర్స్), సీనియర్ న్యాయవాది కె.పి.ఈశ్వర్ నాథ్ (కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్), ఆదర్శ లా కాలేజ్ లెక్చరర్ ఎన్.విద్యాసాగర్ ( ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ లేబర్ ఆక్ట్) చట్టాల గురించి మాట్లాడారు.
న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జే.ఉపేందర్ రావు న్యాయ సేవా సంస్థ విధులు, లక్ష్యాలు, ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, నాల్సా స్కీమ్ ల గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది ఆర్.సురేష్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.