ఆత్మకూరు, మే 3 : రాష్ట్రంలో మరో 20 ఏండ్లు బీఆర్ఎస్దే అధికారమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3.70కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, కట్టు కాల్వ, రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాన పనులకు శంకుస్థాపన చేశారు. పెద్ద చెరువు నుంచి బ్రాహ్మణపల్లి చెరువులోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ హాయంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతోందన్నారు.
పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి చెందాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, వైస్‌ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, ఉపసర్పంచ్ వంగాల స్వాతి, టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, నాయకులు భాషబోయిన సాగర్, నత్తి సుధాకర్, అంబటి రాజస్వామి, అర్షం మధుకర్, బొల్లోబోయిన రవియాదవ్, సర్పంచ్‌లు అర్షం బలరాం, కొరే లలిత, మాడిశెట్టి వేణుగోపాల్, డీఈ లింగారెడ్డి, ఎంపీడీవో కే శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ ఏఈ లలిత పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే రాష్ర్టానికి మంచి రోజులు ఉంటాయన్నారు. కాగా, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శివాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆలయ కమిటీ బాధ్యులు విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన వంతు సాయం తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు.