నర్సింహులపేట, మే 9 ;వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు(ఐస్ యాపిల్) ప్రత్యేకమైనవి. కల్తీలేనివి, స్వచ్ఛమైనవి కావడం వల్ల వీటిని పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. వేసవి సెలవులకు పల్లెటూర్లకు వెళ్లేవారు కచ్చితంగా లాగిస్తారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా విరివిగా దొరుకుతున్నాయి. మండుటెండల నుంచి ఉపశమనం కలిగించడమే గాక ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతాయి.
తాటిముంజలను ఇష్టపడని వారు ఉండరు. వేసవి వచ్చిందంటే తాటి ముంజల విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. తాటిముంజలు శరీరంలోని చకెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. గ్రామాల నుంచి తీసుకొచ్చి వీటిని విక్రయిస్తుంటారు. పట్టణాల్లో డజను ముంజలు రూ.60 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. తాటి ముంజలు గర్భిణులకు ఔషధంలా పనిచేస్తాయని వైద్యులు అంటున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. వేసవిలో నాలుగు ముంజలు తింటే డీహైడ్రేషన్ నుంచి విముక్తి కలుగుతుంది. ప్రాంతాలను బట్టి కొందరు వీటిని సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుకుంటారు. ముంజలను చిన్న చిన్న ముకలుగా కొసి స్వీట్లు, లస్సీ, జ్యూస్, సలాడ్తో పాటు చికెన్, మటన్లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి, ఐరన్ , కాల్షియం పుషలంగా ఉన్నాయి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. పుట్టబోయే బిడ బాగుంటుంది. సీజనల్గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది.
పోషకాలిలా..
ఆరోగ్యానికి మేలు..
వేసవిలో తాటిముంజలు తింటే మంచిది. శరీరానికి పోషకాలు అందుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా దోహదపడతాయి. ముఖ్యంగా గర్భిణులు తాటిముంజలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. సీజనల్గా దొరికే పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది.
– చైతన్య, వైద్యాధికారి