జనగామ, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ స్వచ్ఛం ద సంస్థ నిర్వహించిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. ప్రజల నుంచి అభిప్రాయా లు సేకరించి చేసిన ఈ సర్వేలో ఆయన ముందువరుసలో ఉండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలోని ఆయా గ్రామాల అవసరాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అనేక అభివృ ద్ధి పనులు చేయడం, ప్రతి ఒకరికీ చేరువై ప్రజా నాయకుడిగా ము ద్రవేసుకోవడం వంటి అంశాలు ఆయనకు ఈ గుర్తింపు తీసుకొచ్చినట్లు సర్వే సంస్థ పేర్కొన్నది. అంతేగాక ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా.. చెప్పినప్పుడే పనిచేసి చూపడంలో ముందుండే ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండడం, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండడం ఆయనకు విశేషమైన విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ప్రజల మద్దతే తనకు ప్రధాన బలమని.. ఈ సర్వే ర్యాంకింగ్ ద్వారా మళ్లీ రుజువు అయిందని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.
జనగామ రూరల్, ఏప్రిల్ 5 : రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరుపై ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పనితీరు బాగుందని రావడం సంతోషం. సర్వేలో 6వ స్థానం ఆయన పనితీరుకు నిదర్శనం. కేవలం పనితీరే కాకుండా ప్రజల కోసం నిత్యం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రమే.
అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని తన సొంత ఆసుపత్రిలో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయం. ఇలాంటి నాయకుడు జనగామ ప్రజలకు దొరకడం అదృష్టం. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన.. మరింత సేవ చేసి మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నా.
– బాల్దె విజయ, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్, జనగామ