ఇద్దరు యువకుల మృతి
పాకాల వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గ 19వ డివిజన్‌కు చెందిన ఎండీ జాకీర్(24) టైర్ల షాపులో పనిచేస్తున్నాడు.
- వాగులో పడి ఒకరు, కెనాల్లో పడి మరొకరు..
ఖానాపురం/కాశీబుగ్గ, ఫిబ్రవరి 25: పాకాల వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గ 19వ డివిజన్‌కు చెందిన ఎండీ జాకీర్(24) టైర్ల షాపులో పనిచేస్తున్నాడు. ఆదివా రం సెలవు కావడంతో విందు చేసుకునేందుకు ఇద్దరు మిత్రులు ఎస్డీ షరన్, చింతల్ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన ఎస్డీ రెహాన్‌తో కలిసి వచ్చారు. గిరకతాళ్ల సమీపంలో విందు ఈత కొట్టేందుకు సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. ముగ్గురికీ ఈత రాదు. మొదట జాకీర్ తక్కువ లోతు నీళ్లలో దిగాడు. అతడు నిలబడిన రాయి పాకురు పట్టి ఉండడంతో జారి వాగులో పడిపోయి నీళ్లలో మునిగిపోయాడు.
స్నేహితులు ఇద్దరు అతడిని కాపాడేందుకు నీళ్లలో దిగి మునిగిపోతుండగా కేకలు వేశారు. వారికి చెట్టుకొమ్మ దొరకడంతో పట్టుకున్నారు. కేకలు విన్న ఆటోడ్రైవర్ మడిపెద్ది రమేశ్, రైతు జంపయ్య ఇద్దరిని బయటకు తీశారు. జాకీర్‌ను రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే నీట మునిగి మృతి చెందాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీసి మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని నర్సంపేటలోని మార్చురీకి తరలించారు. మృతుడికి తండ్రి ఆటోడ్రైవర్, తల్లి, సోదరుడు ఉన్నారు.
కెనాల్లో పడి మరొకరు..
ధర్మసాగర్ : మండలంలోని ఎలుకుర్తి గ్రామం దేవాదుల సౌత్ కెనాల్లో పడి రఘుతేజ ఆదివారం మృతి చెందాడు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉర్సు కరీమాబాద్‌కు చెందిన దూడ రఘుతేజ (26) నర్సింగరావుపల్లె గ్రామంలోని మండల అరుణ్ కుమార్ ఇంటికి దశదినకర్మకు వచ్చాడు. రఘుతేజ, అరుణ్‌కుమార్, రోహిత్ ఎలుకుర్తి సమీపంలోని దేవాదుల సౌత్ కెనాల్ వద్ద కు బహిర్భూమికి వెళ్లారు. కెనాల్లోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి రఘుతేజ చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

