బచ్చన్నపేట, అక్టోబర్ 15 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు, వీఎస్ఆర్ నగర్ గ్రామలలో బుధవారం కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది. సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వరద పాలైంది.
ఆరుగాలం కష్టించి కాపాడుకుంటూ చేతికొచ్చిన పంట నీటముగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.