వర్ధన్నపేట, ఏప్రిల్ 30: ట్రాక్టర్ టైర్ కింద పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని ఇల్లంద శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన ఇటుకుల రవి(45) ఇల్లంద నుంచి జగ్గయ్యగుండ్లకు ట్రాక్టర్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో శనిగలకుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న రవి కిందపడిపోవడంతో డబ్బా టైర్ అతడి తలపైకి ఎక్కింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని లక్నేపల్లి శివారు బిట్స్ కళాశాల సమీపంలో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన సపాటి నాగేందర్-స్వరూప దంపతులు బైక్‌పై నర్సంపేటకు వచ్చారు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా లక్నేపల్లి శివారులో వ్యాన్ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగేందర్(52), స్వరూపకు తీవ్ర గాయాలు కాగా, వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈ నాగేందర్‌ను అక్కడి నుంచి హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.