లింగాల ఘనపురం : కారును బైక్ ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని పటేల్ గూడెం- నెల్లుట్ల గ్రామాల మధ్య సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నవాబుపేటకు చెందిన బోళ్ల కళ్యాణ్(26) బూడిద సాయి, (26) ఇద్దరూ జనగామలో ఓ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు.
జనగామ నుంచి వీరిద్దరూ లంచ్ కోసం బైక్ పై నవాబుపేటకు వెళ్తుండగా పటేల్ గూడెం- నెల్లుట్ల గ్రామాల మధ్యన సూర్యాపేట నుంచి జనగామ వైపు వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బోళ్ల కళ్యాణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. బూడిద సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరించారు.