మహబూబాబాద్ : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అవమనించడం అలవాటుగా మార్చుకుంది. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు పైగా అన్నదాతలను అవమానిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో యూరియా కోసం వచ్చిన రైతులను అధికారులు అవమానించారు.
మరిపెడ మండల కేంద్రం సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం వచ్చిన రైతులకు ఆధార్, పట్టా పాస్ బుక్ తీసుకొని యూరియా ఇస్తామని చెప్పిన అధికారులు వాటిని చిత్తు కాగితాల్లగా బయటపడేశారు. దీంతో రైతులు తంటాలు పడుతూ యారియా కోసం నిలబడ్డ లైన్ను వదిలేసి వారి వారి ఆధార్, పాస్బుక్ జిరాక్సులు ఏరుకునే పనిలో నిమగ్నమవడంతో అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.