నర్సంపేట, ఫిబ్రవరి 17 : బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపాలిటీలో కేక్ కట్ చేసి కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈఎస్ఐ కార్డులు అందజేశారు. ఆలయం, చర్చి, మసీద్‌లో ప్రార్థనలు చేసి మొక్కలు నాటారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇవ్వని హామీలు, పథకాలను కూడా ప్రకటించి ఇస్తున్నారన్నారు. సీఎం నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మురాల మోహన్‌రెడ్డి, గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి, మండల శ్రీనివాస్, సారంగపాణి, కమిషనర్ విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.