Nursing school | నర్సింగ్ స్కూల్ తరగతి గదిలో ఊడిపడిన పెచ్చులు
ఎంజీఎంహెచ్ ఆవరణలోని నర్సింగ్ స్కూల్ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపోయాయి.
వరంగల్ చౌరస్తా : ఎంజీఎంహెచ్ ఆవరణలోని నర్సింగ్ స్కూల్ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపోయాయి. ఆదివారం రాత్రి సుమారు 9:45గంటల సమయంలో ఈ ఘనట చోటుచేసుకోగా సోమవారం ఉదయం విషయం వెలుగుచూసింది. మొదటి అంతస్తులోని తరగతి గదిలో భారీగా పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థినిలు ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం పెచ్చులు ఊడిపోడినట్లు విద్యార్థులు తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలంలో భవనం శిధిలావస్థకు చేరి విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారే తప్ప మరమ్మతుల విషయంపై శ్రద్ధ కనబరచలేదు.
పెచ్చులు ఊడిపడిన సమయంలో తరగతిగదిలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, తరగతులు జరుగుతున్న సమయంలో పెచ్చులు పడవుంటే పరిస్థితి మరో తీరుగా ఉండేదని విద్యార్థినిలు ఆవేధన వ్యక్తం చేశారు. పెచ్చులు ఊడిపడిన ఘటనపై ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ కుమార్ వివరణ కోరగా భవనం మరమ్మతుల విషయం గతంలోనే ఉన్నతాధికారులకు సూచించామని, ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై సోమవారం ఉదయం సమాచారం అందించడంతో డీఎంఈ స్పందించి వెంటనే భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఘటన జరిగిన భవనంలోనికి మీడియాను అనుమతించకుండా గేటుకు తాళం వేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ లోనికి అనుమతించలేదు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

