హనుమకొండ చౌరస్తా, జూన్ 12: విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతో కొత్త నోట్‌బుక్ ముద్రించారు. ఈ సంఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నోట్బుక్స్పంపిణీ చేసేందుకు విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ముద్రించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరాయి. కాగా, హనుమకొండ లష్కర్‌బజార్‌లోని మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు నోట్బుక్స్పంపిణీ చేస్తుండగా మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతో ఉన్న నోట్‌బుక్ రావడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.
వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ నోట్‌బుక్‌ను మూలనపడేసి ఇతర నోట్‌బుక్స్‌ను పంపిణీ చేయడం విశేషం. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నోట్‌బుక్స్‌లో ఆ ఒక్క నోట్‌బుక్‌పై కేసీఆర్ ఫొటో రావడంపై ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వెంటనే విషయాన్ని విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నట్లు సమాచారం.