హనుమకొండ చౌరస్తా, మే 22: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీలో నెలకొన్న 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్‌కాలేజీ బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆరేడు నెలలుగా ఆర్ట్స్ కాలేజీ సహాయక రిజిస్టర్ లేరన్నారు.
కాలేజీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కాలేజీని అందంగా తీర్చిదిద్దడం కోసం కావాల్సిన నిధులను సమకూర్చాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోధనేతల సిబ్బంది సంఘం అధ్యక్షులు భూక్య రాజు కోరారు. కాలేజీలో సమస్యలను పరిష్కరించేందుకు వీసీ సానుకూలంగా స్పందించారని రాజు తెలిపారు.